MANDAARA POOVALLE LYRICS - AWAARA | BENNY DAYAL. Lyrics - BENNY DAYAL.
Singer | BENNY DAYAL. |
Composer | YUVAN SHANKAR RAJA |
Music | YUVAN SHANKAR RAJA |
Song Writer | BHUVANA CHANDRA |
Lyrics
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి
తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి
యదలో ఎంతున్నా ఒక మాటే రాదే
నా కళ్ళల్లోన అరె కలలే రావే
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
మదిలో మౌనం రగిలే వేళ కొంచెం మోహం దాహం చుట్టివేసెనే
తొలిచూపే విరి తూర్పై యద తలుపుని మెరుపల్లె తట్టివేసెనే
అద్దాన్ని సరిచేసి మనసంతా కళ్ళల్లో పొదిగానే పొదిగానే
పిల్లా నే నీ ముందు మురిపాల వలపుల్లో తడిసానే తడిసానే
పురి విప్పే మేఘాన్నై ఒడిలో తారగ నిను తలిచా
వేసవిలో వెల్లువనై బుగ్గలు తాకి యద మరిచా
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
అలలాగా కుదిపేసే తన పేరుని వింటే పరిమళమే
కలలోనే కనిపించే తన నగవులు కంటే పరవశమే
ఏనాటి ఊసుల్నో ఏనాటి బాసల్నో వింటున్నా వింటున్నా
ఆగంటు నిలదీసే రహదారి దీపాన్నై నిలుచున్నా వెలిగున్నా
మది తొలిచే పాటలకి అర్ధాలే నీవని మురిసితినే
ఒక నదిలా నీవొస్తే బాగా దూరం తరిగెనులే
నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి
తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి
యదలో ఎంతున్నా ఒక మాటే రాదే
నా కళ్ళల్లోన అరె కలలే రావే
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా