DHOOM DHAAM DOSTHAAN LYRICS - DASARA | RAHUL SIPLIGUNJ ,GOTTE KANAKAVVA Lyrics - RAHUL SIPLIGUNJ, GOTTE KANAKAVVA.
Singer | RAHUL SIPLIGUNJ, GOTTE KANAKAVVA. |
Composer | SANTOSH NARAYANAN |
Music | SANTOSH NARAYANAN |
Song Writer | KASARLA SHYAM |
Lyrics
ఉంటే వైకుంఠం.. లేకుంటే ఊకుంటాం
అంత లావైతే గుంజుకుంటం.. తింటం.. పంటం..
ఐతయ్య్ ఐతయ్య్ ఐతయ్య్ ఐతయ్య్.. బద్దల్ బాశింగాలైతయ్
అరె యేం గొడతర్ర బయ్.. ఉకొర్రి..
నీ యవ్వ మా మామగాడు శెప్పుడు సరే..
మీరు గొట్టుడు సరే..
అరె ఓ నైంటి.. ఈల్లకింకో నైంటి వొయ్ రా..
ఎట్ల గొట్టరో సూద్దాం.. నీ య
పవ్వగొట్టు.. పవ్వగొట్టు.. బోటికూర.. దానంచుకు వెట్టు
బ్యాండు గొట్టు.. బ్యాండు గొట్టు.. వాడకట్టు లేశూగేటట్టు
గుద్దితె సూస్కో.. ఓ అద్దశేరు
గజ్జెల గుర్రం.. ఈ సిల్కు బారు
ఇచ్చిపడేద్దాం.. చల్ కుచ్చిపడేద్దాం
ఎవ్వడడ్డమొత్తడో జూద్దాం
బాంచత్.. ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్..
సుట్టూర దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్
జమ్మిని బొగ్గును బంగారమే అంటం..
బంగారం లాంటి మనుషుల్లో ఉంటం
డొక్కలు నింపే.. ఊరే మా అవ్వ
జేబులు నింపే.. రైలే మా అయ్య
బర్ల మోతా.. శెర్ల ఈతా
ఇగ కోడికూతా.. మాకేం ఎరుక
బాంచత్.. ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం అరె ధూం ధాం.. భలె భలె భలె భలె
చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ
బంగారి బొమ్మ దొరికేనమ్మో.. ఈ వాడలోనా
రాగి బిందెను తీస్క.. రమణి నీళ్ళకు బోతే
రాములోరు ఎదురాయేనమ్మో.. ఈ వాడలోనా
తీట లెక్కలు జేస్తేనే జోరు..
ఘాటుగ ఉండాలెరా.. బతుకు తీరు
నల్లి బొక్కలు జూత్తే ఉషారు
ఏం తింటవ్ రా ఉప్పులేని పప్పుచారు
గోషి గొంగడి మా కట్టుబొట్టు
ఎట్లైతే గట్లయితది.. సూస్కుందాం పట్టు
అంబలి గట్క.. మాది రాచ పుటక
పూట పూట మాకే దసరా
బాంచత్.. ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం
ధూం దాం అరె ధూం ధాం.. భలె భలె భలె భలె