AY PILLA LYRICS | LOVE STORY | HARI CHARAN Lyrics - HARI CHARAN
Singer | HARI CHARAN |
Composer | PAWAN CH |
Music | PAWAN CH |
Song Writer | CHAITANYA PINGALI |
Lyrics
ఏయ్ పిల్ల పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
రా రా కంచె దుంకి
చక చక ఉరుకుతు
ఆ రంగుల విల్లుని తీసి ఈ వైపు వంతెన వేసి రావా
ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే పొరవుతున్నా
గాల్లో పతంగిమల్లె ఎగిరే కలలే నావి
ఆశనిరాశల ఉయ్యాలాటలు పొద్దుమాపుల మధ్యే
నాకంటూ ఉంటే ఉందంతా ఇక నీకే
నీతో ఇలా ఏ బెరుకు లేకుండా
నీవే ఇగ నా బతుకు అంటున్నా
నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడగా
నీ తలలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిలమిల చూడు
వచ్చే మలుపులు
రస్తా వెలుగులు జారే చినుకుల జల్లే
పడుగూ పేక మల్లె
నిన్ను నన్ను అల్లే
పొద్దే తెలియక, గల్లీ పొడుగున
ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉంటే
ఉందంతా ఇక నీకే
ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
పారే నదై నా కలలు ఉన్నాయ్
చేరే దరే ఓ వెదుకుతున్నాయే
నా గుండె ఓలి చేసి
ఆచి తూచి అందించా జాతరలా
ఆ క్షణము చాతి పైన సోలి చూశా లోకం మెరుపుల జాడే
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి
నేలన కనిపిస్తుందే
మారే నీడలు గీసే
తేలే బొమ్మలు చూస్తే
పట్నం చేరిన పాలపుంతలు
పల్లెల సంతలు బారే
నాకంటూ ఉంటే
ఉందంతా ఇక నీకే