SUNDARI NENE NUVVANTA LYRICS -DALAPATHI | S.P.BALASUBRAMANYAM, K.S. CHITRA Lyrics - S.P. BALASUBRAMANYAM, K.S. CHITRA
Singer | S.P. BALASUBRAMANYAM, K.S. CHITRA |
Composer | ILAYARAJA |
Music | ILAYARAJA |
Song Writer | RAJA SRI |
Lyrics
పల్లవి
సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంటా… నీడగా పాడమంట, నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంటా
చరణం – 1
అనుకున్న మాటలు సర్వం కరిగీపోతే న్యాయమా
మధురాల మధువులు చింది… చల్లని ప్రేమే మాయమా
ఆ ఆ, రేపవలు నిద్దరలోను… ఎదనీ తోడే పోదును
యుద్ధాన ఏమైనా… నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళ… ఏల ఈ శోధన
జాబిలిని నీవడుగు… తెలుపు నా వేధన
నాలో ప్రేమే మరిచావు… ప్రేమే నన్నే గెలిచేనే
కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
గుండెలో నిండమంటా నీడగా పాడమంట, నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
చరణం – 2
పువ్వులే ముల్లై తోచు… నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు… నీ ఎదమాటున చేరితే
మాసాలు వారాలౌను… నీవు నేను కూడితే
వారాలు మాసాలౌను… బాటే మారీ సాగితే
పొంగు నీ బంధాలే…. నీ దరి చేరితే
గాయాలు ఆరేను… నీ ఎదుటవుంటే
నీవే కదా నా ప్రాణం… నీవే కదా నా లోకం
సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంటా… నీడగా పాడమంట, నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట