PO POVE EKANTHAM LYRICS - RAGHUVARAN B.TECH | DHANUNJAY Lyrics - DHANUNJAY
Singer | DHANUNJAY |
Composer | ANIRUDH RAVICHANDER |
Music | ANIRUDH RAVICHANDHER |
Song Writer | RAMAJOGAYYA SASTRY |
Lyrics
పో పోవే ఏకాంతం … నా రాణి నా సొంతం...
చేరుకుంది కల నిండు పూమాసంలా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా
లల లల లల ల... లల లల లల ల
పో పోవే ఏకాంతం … నా రాణి నా సొంతం...
ఏ తోడు లేక నలిగింది సమయం
నీ నీడ తగిలాక వెలిగింది హృదయం
నిట్టూర్పు సెగలే గతకాల గమనం
ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం
ఎదనే తడిపే చిన్నారి చినుకా
తడిశా మురిసా ఇక చాలనక
నిను తాకు గాలి నాపైన వాలి
అమ్మల్లే పాడింది అందాల లాలి
లల లల లల ల
ఓ ఓ ఓ ఓహో
లల లల లల ల
పో పోవే ఏకాంతం … నా రాణి నా సొంతం...
చేరుకుంది కల నిండు పూమాసంలా