OH PRIYA PRIYA LYRICS - GEETHANJALI | S.P.BALASUBRAMANYAM Lyrics - S.P. BALASUBRAMANYAM
Singer | S.P. BALASUBRAMANYAM |
Composer | ILAYARAJA |
Music | ILAYARAJA |
Song Writer | VETURI SUNDARAMA MURTHY |
Lyrics
ఆ ...............
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదోలోకం నాదోలోకం నింగి నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు
నింగి నేల తాకేవేళ నీవే నేనైపోయేవేళాయే
నేడు కాదులే రేపు లేదులే
వీడుకోలిదే వీడుకోలిదే
నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
రాజ శాసనలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాళిదాసు గీతికి క్రిష్ణరాసలీలకి
ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి తాజుమహల్ శోభకి
పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధి కన్నా ఎద మిన్న
గెలిపించు ప్రేమనే
కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి
నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం ప్రేమదే జయం