NUVVU NAATHO EMANNAVO LYRICS - DISCO RAJA | S.P. BALASUBRAMANYAM. Lyrics - S.P. BALASUBRAMANYAM
Singer | S.P. BALASUBRAMANYAM |
Composer | THAMAN S |
Music | THAMAN S |
Song Writer | SIRIVENNELA SITARAMA SASTRY |
Lyrics
నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో..
బదులేదో ఏం చెప్పావో… ఏమనుకున్నానో..
భాషంటూలేని భావాలేవో… నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై..
నీ మనసునే తాకనా..
ఎటు సాగాలో అడగని… ఈ గాలితో..
ఎప్పుడాగాలో తెలియని… వేగాలతో..
భాషంటూ లేని భావాలేవో… నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై..
నీ మనసునే తాకనా..
నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో..
బదులేదో ఏం చెప్పావో… ఏమనుకున్నానో..
భాషంటూలేని భావాలేవో… నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై..
నీ మనసునే తాకనా..
నీలాల నీ కనుపాపలో… ఏ మేఘసందేశమో..
ఈనాడిలా సావాసమై… అందింది నా కోసమే..
చిరునామా లేని లేఖంటి నా గానం… చేరిందా నిన్ను ఇన్నాళ్లకీ..
నచ్చిందో లేదో… ఓ చిన్న సందేహం.. తీర్చేశావేమో ఈనాటికి..
మౌనరాగాలు పలికే సరాగాలతో… మందహాసాలు చిలికే పరాగాలతో..
భాషంటూ లేని భావాలేవో… నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై..
నీ మనసునే తాకనా..
నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో..
బదులేదో ఏం చెప్పావో… ఏమనుకున్నానో..
నీ కురులలో ఈ పరిమళం… నన్నల్లుతూ ఉండగా..
నీ తనువులో ఈ పరవశం… నను నేను మరిచేంతగా..
రెక్కల్లా మారే దేహాల సాయంతో… దిక్కుల్ని దాటి విహరించుదాం..
రెప్పల్లో వాలే మొహాల భారంతో… స్వప్నాలేన్నెన్నో కనిపెంచుదాం..
మంచు తెరలన్ని కరిగించు ఆవిర్లతో… హాయిగా అలసిపోతున్న ఆహాలతో..
భాషంటూ లేని భావాలేవో… నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై..
నీ మనసునే తాకనా..
నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో..
బదులేదో ఏం చెప్పావో… ఏమనుకున్నానో..