మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే… వలపు పంటరా
మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే… వలపు పంటరా
వెన్నెలల్లె పూలు విరిసి… తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి… ప్రేమలు కొసరెను
చందనాలు జల్లు కురిసె… చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె… నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం… సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు… అలకల ఉలుకులు
నా చెలి సొగసులు… నన్నే మరిపించే
మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
ముద్దబంతి లేత నవ్వులు… చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు… వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు… నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె… నా చెలి పిలుపులు
సందె వేళ పలికే… నాలో పల్లవి
సంతసాల సిరులే… నావే అన్నవి
ముసి ముసి తలపులు… తరగని వలపులు
నా చెలి సొగసులు… అన్నీ ఇక నావే
మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే… వలపు పంటరా...
Old Is Gold😍
ReplyDeleteNice bro💥..keep going...
ReplyDelete