శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకీ రాయని కథగా సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురి
అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
రాం రాం రాం రాం
రామనామ జీవన నిర్నిద్రుడు
పునఃదర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై
ఘోరతపస్సును చేసెనప్పుడు
తపమును మెచ్చి ధరణికి వచ్చి
దర్శనమిచ్చెను మహావిష్ణువు
త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడు
ధరణీ పతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పోగా
సీతాలక్ష్మణ సహితుడై
కొలువు తీరె కొండంత దేవుడు
శిలగా మళ్ళీ మలచి
శిరమును నీవే నిలచి
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరె భద్రుడు
వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే
అదిగో అదిగో భద్రగిరి
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి